నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఎస్పీ నేతలు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్, రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం హైదరాబాద్‌లో సమావేశమై రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాలపై చర్చించారు. అనంతరం పొత్తులపై బీఎస్పీ నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరు పార్టీల మధ్య పొత్తులు సఫలీకృతమయ్యాయని పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతితో చర్చించిన తర్వాత పోటీ చేసే స్థానాలపై ప్రకటన చేయనున్నట్టు తెలిపారు.