
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ నాయకులతో ఎంపీడీఓ క్రాంతి ఆద్వర్యంలో ఓటరు జాబితా అభ్యంతరలపై సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ఓటరు జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశామని, అందులో ఏమైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే గ్రామపంచాయతీ కార్యాలయంలోని కార్యదర్శి దృష్టికి తీసుకువస్తే సవరణలు చేస్తామని సూచించారు. ఈ ఓటరు జాబితా అందురు రాజకీయ నాయకుల, ప్రజల సమక్షంలో ఉంచి, అందిరి సలహాలతో రూపొందించినదిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.