
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులపై ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అధ్యక్షతన అన్ని పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ లిస్టులో తప్పులు లేకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా అన్ని పార్టీల నాయకులు సూచనలు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని కోరినట్లు వివరించారు.సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, నాయకులు ఊట్నూరి ప్రదీప్, బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు కొత్తపల్లి రఘు, బిజెపి మండల నాయకులు ప్రవీణ్, సిపిఐ( ఎంఎన్) మాస్ లైన్ ప్రజా ప్రంథా నాయకులు సారా సురేష్, మండల పంచాయతీ అధికారి సదానంద్, తదితరులు పాల్గొన్నారు.