
మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం వివిధ పార్టీలకు చెందిన నాయకులు,ఆయా గ్రామాలకు చెందిన కార్యదర్శులతో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్, వార్డుల వారిగా తమ అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఎంపీడీఓ వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంపీఓ శివ చరణ్, కాంగ్రేస్ పార్టీ మండలాధ్యక్షులు దేవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి, గుండ విఠల్ పాల్గొన్నారు.