మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం మండల స్థాయిలో సీఎం కప్ క్రీడల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఎం కప్ ఆటల పోటీల నిర్వహణపై ఎంపీడీవో అవగాహన కల్పించారు.సీఎం కప్ 2024 గ్రామ స్థాయిలో 7, 8 తేదీలలో, మండల స్థాయిలో 10,11,12 తేదీలలో ఆటల పోటీలను నిర్వహించాలన్నారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు 4వ తేదీలోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ విషయమై గ్రామ పంచాయతీలలో టామ్ టామ్ ద్వారా, మైకుల ద్వారా చెప్పించవలసినదిగా పంచాయతీ కార్యదర్శులకు పీడీవో సూచించారు. సమావేశంలో కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, మండల పంచాయతీ అధికారి సదాశివ్, మండలంలోని ఆయా ఉన్నత పాఠశాలలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.