
రాజంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాలలో ఎంఈఓ పూర్ణచందర్ శనివారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సమస్యలను పరిష్కరించాలని ఎంఈఓ కి తెలిపారు. మన ఊరు మనబడి పథకంలో భాగంగా పాఠశాలలో జరగవలసిన పనులు నేటికీ పూర్తి చేయలేదని, మరుగుదొడ్లు, పాఠశాల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యలను త్వరలో పూర్తిచేసి పరిష్కరిస్తామని తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.