
పట్టణంలోని యం.పి.డి.ఓ కార్యాలయంలోని బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారి, శ్రీ.రాజా గౌడ్ ఆర్మూర్ అర్బన్ రూరల్ బి.యల్.ఓ లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పిడబ్ల్యుఓ ,85 సంవత్సరాలు పైబడిన ఓటర్ల జాబితాలు పోలింగ్ బూతుల వారిగా బి.యల్.ఓ లకు అందజేయడం జరిగింది. అట్టి జాబితాలో ఉన్న ఓటర్లందరికీ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో “హోమ్ వోటింగ్” ప్రక్రియలో భాగంగా 12(డి) దరఖాస్తు ఫారాలను అందించాలని తెలియజేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో తహసిల్దార్ శ్రీ.గజానన్, ఉప తహసిల్దార్ (ఎన్నికలు) శ్రీమతి కే. పద్మ, సూపర్ వైజర్లు బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.