జిల్లాలో రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గం లో బస్సు డిపో ఏర్పాటు కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలుస్తూ పలు అభివృద్ధి పనుల మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు. బస్సు డిపో ఏర్పాటుతోపాటు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని మంత్రి గారికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.