ఓటరు జాబితాపై ప్రజా ప్రతినిధులతో సమావేశం

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని 18 గ్రామ పంచాయతీలలోని 182 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఈనెల 13వ తేదీ నాడు ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి తెలిపారు. గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన ఓటర్ల జాబితా పై నేడు గురువారం రోజు మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధుల సమావేశం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేయడం జరుగుతుందని సమావేశానికి హాజరై ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను తెలియజేయాలని ప్రకటనలో తెలిపారు.