
తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ ను (త్రిబుల్ ఐటీ బాసర) మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు వివరించినట్లు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు వి దత్తాహరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేశామని, తొందరలోనే , ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గత అనేక ఏళ్లుగా తాము యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నామని, ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం తమందరికి గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గంగా కిషన్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.