అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం..

Mega Blood Donation Camp as part of Martyrs Week.– తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి 
– యువత ముందుకు రావాలి..
నవతెలంగాణ – తాడ్వాయి
పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రేపు గురువారం ములుగు జిల్లా కేంద్రంలో ఏ ఆర్ హెడ్ కోటర్స్ నందు నిర్వహించు రక్తదాన శిబిరాన్ని, యువకులు విద్యార్థులు ఆటో యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రక్త దానం చేసి, విజయవంతం చేయాలని తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ అమరుల సంస్కరణ దినోత్సవ సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాలతో, జిల్లా కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు, మండలంలోని యువత, ఆటో యూనియన్ సభ్యులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో హాజరై “రక్త దానం” చేసి నిరుపేద జీవితాలకు, రోగులకు ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా రక్తాన్ని అందించేవారు రియల్ హీరోగా అభివర్ణించారు. కావున రేపు గురువారం జరుగు మెగా రక్తదాన శిబిరానికి హాజరై పెద్ద మొత్తంలో రక్త దానం చేయాలని విజ్ఞప్తి చేశారు.