పేదల కోసమే మెగా కార్డియాక్ క్యాంపు: ఎమ్మెల్యే

Mega cardiac camp for the poor: MLA– సద్వినియోగం చేసుకోవాలి: సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట  
నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం ఉంటున్న పేదల కోసమే హైదరాబాద్ కు చెందిన కేర్ హాస్పిటల్ వారి సహకారంతో మెగా కార్డియాక్ క్యాంపు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీబీఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనురాధ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిలో క్యాంపును వారు ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడారు. గుండె ఎముకలు న్యూరో సంబంధిత  వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ క్యాంపును డాక్టర్లచే చూపించుకొని అత్యవసరమైన చికిత్సలు ఉంటే  కేర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్డెంట్ డా.ప్రభు , డాక్టర్   మహేష్ , కేర్ హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది సాహితీ పారామెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.