నవతెలంగాణ-శేరిలింగంపల్లి
చేవెళ్ళ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి సహకారంతో జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఏంసీఏం ఫంక్షన్ హల్లో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు, 3 కంపెనీలు పాల్గొన్నాయి. స్విగ్గి, ఎక్స్ప్రెస్, హంక్ కంపెనీల నుండి ప్రతినిధులు పాల్గొన్నారని వాళ్ళ కంపెనీ వర్క్ గురించి వివరించారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీి మండలాధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు రాజాచంద్ర, జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎస్ రాములు, స్థానిక నాయకులు, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.