మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి..

Mega job fair should be taken advantage of..– ఎంపీడీవో సుమన వాణి 
నవతెలంగాణ – తాడ్వాయి 
ఈ నెల జనవరి 7వ తారీకున ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో పీఎస్ఆర్ గార్డెన్స్ సోమల గడ్డ క్రాస్ రోడ్ నందు, జిల్లా గ్రామీణాభివృద్ధి – ఈజీ ఎం ఎం   హైదరాబాద్ వారి  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి  (ఎంపీడీవో) అధికారి శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సుమన వాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన 50 ప్రైవేటు కంపెనీల నుండి ఈనెల 7న పి  ఎస్ ఆర్ గార్డెన్స్ చల్వాయి నందు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు మండలంలోని నిరుద్యోగ యువతీ యువకులు హాజరై  వివిధ కంపెనీ లలో ఉద్యోగం పొంది విధంగా, మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.