
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
పద్మశాలి ఆఫీసియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. మండలంలోని మండే పల్లిలోని కెసిఆర్ నగర్ డబుల్ బెడ్ రూం ఇళ్ళ సముదాయంలో ఆదివారం మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు ఈ వైద్య శిబిరాన్ని సిరిసిల్ల ఎంఈఓ దూస రఘుపతి ప్రారంభించారు.సరయు హాస్పిటల్ సౌజన్యంతో పోపా డాక్టర్స్ డా.తడుక సాయి కుమార్, పిల్లల వైద్య నిపుణులు, డా. తాటిపాముల రవళి స్త్రీ వైద్య నిపుణులు,డా. గాదర్ల దీప్తి వైద్య నిపుణులచే ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో 350 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ, దూస రఘుపతి,పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నo చందర్ మాట్లాడుతు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జీవన విధానంలో భాగం చేసుకోవాలని కోరారు. పౌస్టికాహారం తీసుకోవడం ద్వారా అనేక రకాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చని అన్నారు.జీవన శైలి వ్యాదులైన బి.పి. షుగర్, క్యాన్సర్ లను ఎదుర్కొనేందుకు మంచి అలవాట్లను కల్గి వుండాలన్నారు.పిల్లలలో రక్తహీనత ఎక్కువగా వున్నదని,దాన్ని అధిగమించేందుకు పౌష్ఠికాహారం తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో పోపా ప్రతినిదులు వాసాల హరిప్రసాద్, బొల్లి భగవాన్, కొడం రాం ప్రసాద్, అలువాల ఈశ్వర్, దాసరి తిరుమల,గాజుల ప్రతాప్, దుస రఘుపతి, దుసా శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, ద్యావన పల్లి పరమేశ్వర్, కారంపూడి రాజేశం, కనుకుంట్ల మధు, ఘడీల రమేష్, గడ్డం సత్యం, కాశీరాం, శివరాత్రి శంకర్, బైరీ రవీందర్, శేకర్, లక్ష్మణ్, సత్యనారాయణ, గ్రామ ప్రతినిదులు పాల్గొన్నారు.