హైదరాబాద్ : నగరానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన నవనామి ప్రాజెక్ట్స్ కొత్తగా ది మెగాలియోను ఆవిష్కరించినట్లు తెలిపింది. అప్పా జంక్షన్ పీరంచెరులో విలాసవంతమైన నివాస ప్రాజెక్ట్‌గా దీన్ని అభివృద్ధి చేస్తున్నామని నవనామి వ్యవస్థాపకుడు, ఎండీ నవీన్ గద్దె తెలిపారు. దాదాపు 4.1 ఎకరాలలో విస్తరించి ఉన్న మెగాలియో చుట్టూ దాదాపు 1200 ఎకరాలలో పచ్చదనం కనువిందు చేస్తుందన్నారు. రక్షిత జలవనరులైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌ల పరిసరాల్లో భవిష్యత్ నివాసితులకు సహజమైన వాతావరణానికి హామీ కల్పిస్తుందన్నారు. రెండు ఐకానిక్ టవర్లు కలిగి ఉంటాయని.. మొత్తం 150 నివాసాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కేవలం 20 నిమిషాల దూరంలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి కేవలం 15 నిమిషాల దూరంలో ఉంటుందన్నారు.