నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి దంపతులు గురువారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. విక్రమార్కను కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు.ఆ దంపతులకు శాలువా కప్పి భట్టి సత్కారం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు.