‘రారా కష్ణయ్య’ తర్వాత దర్శకుడు పి.మహేష్ బాబు తెరకెక్కించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. నేడు (గురువారం) ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు పి.మహేష్ బాబు
మీడియాతో మాట్లాడుతూ, ‘జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనే ఆలోచన ఉన్న ఒక అమ్మాయి పెళ్లి కాకుండా తల్లి అవడంలో సంతోషాన్ని కోరుకుంటుంది. అందుకోసం ఒక అబ్బాయి హెల్ప్ తీసుకుంటుంది. ఇలా మొదలైన ప్రయాణం ఎక్కడ ముగిసింది?, అనేది ఈ సినిమా. ట్రైలర్‌లోనే మేము ఈ పాయింట్ చెప్పి ఆడియెన్స్‌ను ప్రిపేర్ చేశాం. ట్రైలర్‌ను ఎలా ఎంజారు చేశారో రేపు మూవీని కూడా అలాగే ఎంజారు చేస్తారనే నమ్మకం నాకు ఉంది. నవీన్ పోలిశెట్టి, అనుష్క సిద్ధు, అన్విత క్యారెక్టర్స్‌లో నేచురల్‌గా నటించారు. చిరంజీవి మా సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టెన్షన్‌గా ఉన్న మాకు ఆయన ప్రశంస పెద్ద సక్సెస్ కొట్టిన ఫీలింగ్ ఇచ్చింది’ అని తెలిపారు.