– కాశ్మీర్‌లో 3 స్థానాల్లో పీడీపీ పోటీ
– జమ్ములో రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు మద్దతు
శ్రీనగర్ : పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ లోక్‌సభ ఎన్నికల్లో అనంత్‌నాగ్ – రాజౌరీ స్థానం నుంచి డీపీఏపీ అధ్యక్షులు గులాం నబీ ఆజాద్‌పై పోటీ చేయనున్నారు. ఈ స్థానంతో సహా జమ్ముకాశ్మీర్‌లోని మూడు స్థానాలకు పీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ యువ విభాగ ం అధ్యక్షులు వాహీద్ పర్రా శ్రీనగర్ నుంచి రాజ్యసభ మాజీ సభ్యులు మీర్ ఫయాజ్ బారాముల్లా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు పీడీపీ పార్లమెంటరీ బోర్డు ఛీఫ్ సర్తాజ్ మండి ఆదివారం చెప్పారు. అయితే కాశ్మీర్‌లోయలో మీకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించగా..తాము జాతీయ పార్టీ నుంచి క్విడ్ ప్రోకో తరహాలో మద్దతు ఆశించడం లేదని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే పోరాటంలో భాగంగానే జమ్ములో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు.