నవతెలంగాణ -పెద్దవూర
యూత్ కాంగ్రెస్ నాగార్జున సాగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షునిగా పెద్దవూర మండలం నాయనవానికుంట గ్రామానికి చెందిన మేకల శ్రీకాంత్ ను సోమవారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి శ్రీకాంత్ కి నియామక పత్రం అందజేశారు. అదేవిధంగా జిల్లా కార్యదర్శిగా హనుమంత్ రెడ్డి, నియోజకవర్గ కార్యదర్శిగా లాలు నాయక్, ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. నియమకానికి సహకరించిన కుందూరు జానారెడ్డి కి, శాసనసభ్యులు కుందూరు జైవీర్ కి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి,ఆయన కృతజ్ఞతలు
తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గౌని రాజ రమేష్ యాదవ్, నియోజకవర్గ అధ్యక్షులు పగడాల నాగరాజు యాదవ్, నాయకులు తుమ్మలపల్లి రంగారెడ్డి,పాండు నాయక్, సుధాకర్ రెడ్డి, ముని నాయక్, గిరిబాబు, శశి పాల్ రెడ్డి, బిక్షం, తిరుమల యాదవ్,వరుణ్, నాయక్ పాల్గొన్నారు.