హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా మేకల యాదగిరి ప్రమాణ స్వీకారం..

నవతెలంగాణ – మీర్ పేట్
కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ పాలక మండలి డైరెక్టర్(ధర్మ కర్త) గా జిల్లెలగూడ సాయి కృప నగర్ కాలనీ చెందిన మేకల యాదగిరి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, 16వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, 7వ డివిజన్ కార్పొరేటర్ సిద్దాల బీరప్ప, మీర్ పేట్ బిఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, దోమలపల్లి రాజ్ కుమార్, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జల అనిల్ కుమార్ తదితరులు మేకల యాదగిరికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.