భువనగిరి పట్టణనికి చెందిన జమియతుల్ హుఫ్ఫాజ్ కమెటీ సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి ని కలిసి ముస్లిం మైనారిటీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే భువనగిరి నియోజకవర్గం లోని ముస్లిం మైనారిటీ లకు సంబందించిన సమస్యలను చాలా వరకు పరిష్కారం చేయడం జరిగిందని ఇకముందు కూడా ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే అవికూడా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో హాఫెజ్ ఇబ్రహీం ముఫ్తి అజహర్ టీపు,ఇమాద్ హాజీ అలీం, ఇమ్రాన్, సాజిద్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొల్పుల అమరేందర్ ముదిరాజ్, భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్ కార్యదర్శి రచ్చ శ్రీనివాస్, కౌన్సిలర్ ఖాజా అజీమోద్దీన్ కో ఆప్షన్ మెంబెర్ ఇట్టబోయిన సబితా గోపాల్ షాది ఖానా చైర్మన్ ఎండీ ఇస్మాయిల్, ఎండీ నయీమ్ బాయ్, ఎండీ బురాన్, ఎండీ సుల్తాన్ కాజమ్, వసీమ్ అఫ్రోజ్, అమన్ పాల్గొన్నారు.