మానవత్వం మంట కలుస్తున్న ఈరోజుల్లో కనీసం దహన సంస్కారా లకు కూడా డబ్బుల్లేని పరిస్థితిలో మరణించిన వ్యక్తి కుటుంబానికి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయాన్ని అందించిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. మంగళవారం వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీ లోని వడ్డెర కులానికి చెందిన దండుగుల అశోక్ 40 సంవత్సరాలు రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం. పెద్దదిక్కును కోల్పోయి దహన సంస్కాలకు డబ్బులు లేవని, ఏదైనా మీకుతోచిన సహకారాన్ని అందించండి అని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ను కుటుంబసభ్యులు కోరడంతో ట్రస్టు ఇతర గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో దాతలు మనవతా దృక్పదంతో స్పందించి దాదాపు పదివేల రూపాయలు అందించారు. మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తున్న దాతలకు ఈసందర్భంగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు తరపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, గొంగళ్ళ రవికుమార్, పొలాస రాజేందర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, హోమ్ గార్డ్ ఉప్పరపెల్లి శైలజ పాల్గొన్నారు.