అచ్చంపేట  ఎస్సై ని సన్మానించిన  ఐఎన్టీయూసీ కమిటీ సభ్యులు

నవతెలంగాణ –  అచ్చంపేట
బదిలీపై అచ్చంపేట ఎస్సైగా వచ్చిన  రాములును సోమవారం అచ్చంపేట తాలూకా ఐఎన్టీయూసీ కమిటీ సభ్యులు సన్మానించారు. ప్రాంతం ప్రజలు పోలీస్ వ్యవస్థను ఫ్రెండ్లీ పోలీసుగా భావించి మన కుటుంబ సభ్యుల్లో పెద్దన్న పాత్ర పోలీస్ ఈ విధంగా భావిస్తాము.  పోలీస్ వ్యవస్థలో బదిలీలు సహజం పోయేవారికి వేడుకోలు పలుకుతూ..వచ్చేవారికి స్వాగతం పలుకుతూ మంచి అభిప్రాయాలతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ , బల్మూర్ మండల్ ప్రెసిడెంట్ చందు నాయక్ , తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరామ్,   తాలూకా జర్నలి సెక్రటరీ వెంకటేష్ ,  ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు మౌలానా,  ఉపాధ్యక్షులు స్వామి గౌడ్,  తదితరులు ఉన్నారు.