కాంగ్రేస్ పార్టీలో చేరిన ముస్లీం సంఘ సభ్యులు

నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రానికి చెందిన 60 మంది ముస్లీం సంఘ సభ్యులు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రేస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం కృషిచేయాలని అన్నారు.కార్యక్రమంలో మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు సోమ దేవరెడ్డి,జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివ కుమార్,మండల మైనార్టీ అధ్యక్షులు మునీరోద్దీన్,కిసాన్ ఖేత్ మండలాధ్యక్షులు ముస్కు మోహన్ రెడ్డి,నాయకులు బద్దం లింగారెడ్డి,ఓర్సు రాములు,కల్లెడ పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.