కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సభ్యులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డికి నూతన పాలకవర్గ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. సుదర్శన్ రెడ్డి కూడా నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. భవిష్యత్తులో పాలకవర్గం పటిష్టంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు.కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, డైరెక్టర్ లు జైడి మధులత శ్రీనివాస్, రిక్క ముత్తన్న, నర్సాపురం జీవన్, కిస్టి చిన్న రాజన్న, బాణావత్ రాములు, రొక్కం సంపత్, లక్మ రంజిత్, కోరిపల్లి లింగారెడ్డి, బూత్పురం మహిపాల్, అబ్దుల్ నవీద్, జవ్వాజి శ్రీనివాస్, జొన్నల నడ్పి భూమయ్య, ముచ్కుర్ సొసైటి చైర్మన్ దేవేందర్, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, కమ్మర్ పల్లి కాంగ్రెస్ నాయకులు పాలెపు చిన్న గంగారం, నాగపూర్ అశోక్, తదితరులు ఉన్నారు.