టిటిడి సభ్యులు గడ్డం సీతా రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసిన మీర్ పేట్ నాయకులు

నవతెలంగాణ – మీర్ పేట్ : తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా గడ్డం సీతా రెడ్డి ఎన్నికైన సందర్భంగా మీర్ పేట్ బిఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతా రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ గా నియమితులైన సందర్బంగా మీర్ పేట్ కార్పొరేషన్ 20వ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు వంటేరు నర్సింహ్మరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ప్రేమ్ చంద్ర రెడ్డి, జనార్దన్ రెడ్డి, కిషోర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డిలు ఆమె నివాసంలో కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.