– వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి…
– సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారి…
– మండల సర్వేసభ్య సమావేశం
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని సభ్యులు సమస్యలపై గళమెత్తారు. తంగళ్ళపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ పడిగల మానస అధ్యక్షతన నిర్వహించారు. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత నిర్వహించిన మొదటి మండల సర్వసభ సమావేశంలో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలపై ప్రతి సమావేశంలో సమస్యలు లేవనెత్తిన ఆ సమస్యలు అట్టే ఉన్నాయని ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ సంస్థ తలెత్తిందని వెంటనే విద్యుత్ శాఖ అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు మురికి నీరుగా వస్తున్నాయని అవి త్రాగడానికి వీలు లేకుండా పోతున్నాయని గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు మండిపడ్డారు. మిషన్ భగీరథ అధికారులు వెంటనే ఆ సమస్యను పరిష్కరించి గ్రామాల్లో సజావుగా మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాదు ప్రతి సమావేశంలో కొన్ని శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ హాజరు కావడం లేదని ఎంపీపీ దృష్టికి తీసుకువచ్చారు. కొత్త రేషన్ కార్డులు నమోదు కావడం లేదని కేవలం పాత రేషన్ కార్డుల్లో కొత్త పేర్లను మాత్రమే నమోదు కాపాడుతున్నాయని వాపోయారు. కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులను ఆన్లైన్లో కొన్ని సాంకేతిక లోపాల వల్ల నమోదు కావడం లేదని తహసిల్దార్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. త్వరలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఆ సమస్య కూడా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వారు తెలిపారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ… వేసవికాలంలో అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ సమస్య తలెత్తితే వెంటనే ఆ సమస్యను పరిష్కరించి గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సెస్ అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ పైపుల ద్వారా మంచినీరు సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. తంగళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో దశలవారీగా ప్రభుత్వ పథకాలను అందిస్తూ గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలని, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు తెలిపారు. గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షం వల్ల పంట నష్టం వందల ఎకరాలు వాటిలిందని, వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాలను అంచనా వేసి రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి నివేదికను అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఎంపీడీవో జోగం రాజు, ఎంపిటిసిలు, స్పెషల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.