పీఆర్టీయూ సభ్యత్వం ఓ వరం: సతీష్ రెడ్డి 

PRTU membership is a blessing: Satish Reddyనవతెలంగాణ – పెద్దవంగర
పీఆర్టీయూ సభ్యత్వ నమోదు ఉపాధ్యాయులకు ఓ వరం లాంటిదని ఆ సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల సతీష్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అవుతాపురం, ఉప్పెరగూడెం, పెద్దవంగర పాఠశాలల్లో మండల అధ్యక్షుడు గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైనా సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల సాధనలో పీఆర్టీయూ ఎల్లప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. శాస్త్రీయ వైఖరితో పీఆర్టీయూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. అనంతరం ఇటీవల బదిలీ, పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను మెమోంటో తో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కళాధర్, ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, రమేష్, సురేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.