మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం

Mental health awareness programనవతెలంగాణ – కంటేశ్వర్ 
సూర్య హెల్త్ ఆర్గనైజషన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం గవర్నమెంట్ హై స్కూల్, శంకర్ భవన్, కోటగల్లి లో నిర్వచించారు. ఈ కార్యక్రమము డా.రవితేజ ఇన్నమురి (జిల్లా మానసిక వైద్య నిపుణులు) స్ట్రెస్ మేనేజ్మెంట్, విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డాక్టర్ రవితేజ మాట్లాడుతూ.. విద్యార్థినులకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఉద్దేశంతో అలాగే విద్యార్థుల్లో ఉండే భయాందోళనలు తొలగించి మంచి ఉత్తీర్ణత సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సదుద్దేశంతో అవగాహన కల్పించడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడం  కోపాన్ని అధిగమించడం మానసికంగా ఎలా దృఢంగా ఉండాలి అనే విషయాలపట్ల మానసిక ఒత్తిడిని జయించడానికి పద్ధతులను విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం స్కూల్ హెచ్ ఎం మల్లేష్, స్కూల్ సిబ్బంది 127 మంది విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది, మరియు సంస్థ ఫీల్డ్ కోఆర్డినేటర్ వినోద్ కుమార్, మొదలగువారు ఈయొక్క అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.