మానసిక ఆరోగ్యాన్ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. అందులో విటమిన్ డీ కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా విటమిన్ డీ అనగానే మనం ఎముకల ఆరోగ్యం గురించే ఆలోచిస్తాం. విటమిన్ డీతో. ఎముకలు గుల్లబారకుండా ఉంటాయనీ, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిసిందే. అయితే ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుం దని నిపుణులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు సక్రమంగా పనిచేయడానికి పలు రకాల న్యూరోస్టిరాయిడ్లను వాడకుంటుంది. వీటిలో విటమిన్‌డీ కూడా ఒకటి. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో డాపమైన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే డోపమైన్ ఉత్పత్తయ్యే సబ్‌స్టాన్షియా నైగ్రాతో పాటు మెదడులోని కీలక భాగాల్లోనూ విటమిన్ డి గ్రాహకాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. మానసిక సమస్యలను దూరం చేయడంలో ఈ విటమిన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంటుందని అనడానికి ఇదే నిదర్శన మని నిపుణులు చెబుతున్నారు. అందుకే కచ్చితంగా ఉదయం కాసేపుఎండలోఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎండలో ఉంటే మానసిక స్థితిని ప్రభావితం చేసే సెరటోనిన్ అనే హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుందని అంటున్నారు. దీనివల్ల కుంగు బాటు వంటి లక్షణాలు దూరమవు తాయి. కేవలం సూర్యరశ్మితో మాత్రమే కాకుండా తీసుకునే ఆహారం ద్వారా కూడా శరీరానికి కావాల్సిన విట మిన్‌డీ అందుతుంది. ముఖ్యంగా పాలు, పుట్టగొడు గులు, చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు.