నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మార్కెట్ ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకంకు మెనూ చార్జీలు పెంచి కోడిగుడ్లు మరియు వంటగ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున మెనూ చార్జీలు పెంచి మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా వంట కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారని, కోడుగుడ్డు ధర మార్కెట్లో రూ. 8/- ఉండగా ప్రభుత్వం రూ.5/- మాత్రమే చెల్లించడంతో కార్మికులుపై రూ.3/- అదనపు భారం పడుతుందని కావున ప్రభుత్వమే కోడి గుడ్లను మరియు వంట గ్యాస్ ను సరఫరా చేయాలని, మార్కెట్ ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు ప్రతి విద్యార్థికి రూ. 25/- కు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మధ్యాహ్న భోజనం కార్మికులకు నెలకు రూ. 10 వేలు వెంటనే ఇచ్చి తమ హామీని నిలబెట్టుకోవాలని, ప్రమాద బీమా సౌకర్య కల్పించాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులు వేతనాలను వెంటనే చెల్లించాలని, వంట కార్మికులను తొలగించకుండా జీ.వో ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాగుల వసంత, జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు బుచ్చమ్మ, కృష్ణ, మణెమ్మ, నిర్మల, ఉమా, సంధ్య, మంగ, లత, శ్యామ్, పారిజాత, పద్మ, లక్ష్మి, పుష్ప, సుధాకర్, రాజు, మమత, గంగమ్మ, వెంకటేష్ తో పాటు 200 మంది వంట కార్మికులు పాల్గొన్నారు.