నూతన ప్రధానోపాధ్యాయులు ను సన్మానించిన ఎం.ఇ.ఒ క్రిష్ణయ్య

నవతెలంగాణ – అశ్వారావుపేట: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ను ఎఫ్.ఆర్.యస్ యాప్ ద్వారా ప్రతి రోజు ఉదయం 10 గంటల కల్లా నమోదు చేయాలని యం.ఇ.ఒ కృష్ణయ్య అన్నారు. గురువారం స్థానిక యం.ఆర్.సిలో కాంప్లెక్స ప్రధానోపాధ్యాయులు, సి.ఆర్.పిలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం, యుడైస్, బడిబయటి పిల్లలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. 6వ తేదీ నుండి సి.యం. అల్పాహార పథకం ప్రారంభం కానున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలను స్వీకరించిన కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు ను సత్కరించి ఆహ్వానం పలికారు. విద్యా సంబంధ మైన అన్ని కార్యక్రమాల్లోనూ అశ్వారావుపేట మండలాన్ని ముందు వరుసలో ఉంచాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు హరిత,షాహినా బేగం, పద్మావతి, ప్రసాద్, వెంకయ్య, టి.శ్రీనివాస్, సి.ఆర్.పిలు ప్రభాకరాచార్యులు, రామారావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.