ఎమ్మెల్యే మెచ్చాకు ఐ.ఎఫ్.పి సెట్ గిఫ్ట్ ప్యాక్ ను అందజేసిన ఎం.ఇ.ఒ క్రిష్ణయ్య

నవతెలంగాణ – అశ్వారావుపేట
దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ  ద్వారా పంపిన ఐ.ఎఫ్.పి (ఇంట్రెస్టింగ్ ఫ్లాట్ ప్యానెల్ ) సెట్ గిఫ్ట్ ప్యాక్ ను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కు దమ్మపేట మండలం,తాటి సుబ్బన్న గూడెం లోని ఆయన నివాసం లో మంగళవారం ఎం.ఇ.ఒ క్రిష్ణయ్య అందజేసారు.
అనంతరం విద్యాశాఖ బ్రోచర్  ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఇందులో మన ఊరు మన బడి తో పాటు విద్యాశాఖకు సంబంధించిన కార్యక్రమాలు ల వీడియోను ఎం.ఎల్.ఎ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ఖర్చుతో కూడుకున్న ఐ.ఎఫ్.పి లను పాఠశాలల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో విద్యార్ధులకు అందిస్తున్నారని ,వీటితో డిజిటల్ తరగతులను నిర్వహించడంతో బాటు రీడింగ్ కార్నర్ లను ఏర్పరచి విద్యార్ధులకు అందుబాటులోకి గ్రంధాలయాలు పుస్తకాలను విద్యార్ధులకు అందుబాటులోకి తేవాలని అన్నారు. మధ్యాహ్న భోజన వర్కర్ల బిల్లులు వెంటనే మంజూరు చేయుటకు పై అధికారులతో మాట్లాడతానని అన్నారు. విద్యార్ధులందరికి పోషక విలువలతో కూడిన రాగి జావను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, ఎఫ్.ఎల్.ఎన్ ఆర్.పి కట్టా మధు, సి.సి. మహబూబ్ లు పాల్గొన్నారు.