జాతీయ సాధన సర్వే అనుగుణంగా విద్యార్ధుల్లో సామర్ధ్యాల స్థాయిని పెంపొందించాలని ఇంచార్జి ఎం.ఈ.ఓ లక్ష్మి ఉపాధ్యాయులకు సూచించారు. జాతీయ సాధన సర్వే పై ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు తెలుగు,సాంఘీక శాస్త్రం,భౌతిక శాస్త్రం సబ్జెక్టులు పై ఒక్క రోజు శిక్షణ ఇచ్చారు. అశ్వారావుపేట బాలుర ఉన్నత పాఠశాల,బాలికల ఉన్నత పాఠశాల,అచ్యుతాపురం ఉన్నత పాఠశాలల్లో ఈ శిక్షణ నిర్వహించారు. ఇందులో క్రిష్ణా రోజున రావు,క్రిష్ణ,మధు సూధన్ రావు,ఎం.వెంకటేశ్వరరావు,రమణా చార్యులు ఆర్పీ లుగా వ్యవహరించారు. ఆయా పాఠశాలలు ఉపాధ్యాయులు పి.హరిత,సి.హెచ్.వెంకయ్య,షాహీ నా బేగం లు ఉపాధ్యాయులకు సౌకర్యాలు కల్పించారు.