ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి: ఎంఈఓ

Go ahead with composure: MEOనవతెలంగాణ – పెద్దవంగర

వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రానికి చెందిన వికలాంగులకు మంగళవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అంగవైకల్యం అన్నది శరీరానికి కానీ, మనసుకు కాదన్నారు. దృడ సంకల్పంతో ఆశయాన్ని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేస్తే కచ్చితంగా అనుకున్నది సాధిస్తారని పేర్కొన్నారు. దివ్యాంగులు తమలో ఉన్న వైకల్యం గురించి ఆలోచించకుండా తమలో ఉన్న నైపుణ్యాలను, ప్రావీణ్యతను వెలికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పులుగుజ్జ రామచంద్రు, శివ, సాయి రిషిత, వెంకటయ్య, ఉపాధ్యాయులు కవిరాజు, సదయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.