
సోమవారం నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఎంఈఓ వెంకటేశం అన్నారు. శనివారం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇన్విజిలేటర్ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు ఆయన పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం పరీక్ష కేంద్రాల్లో వేస్తున్న హాల్ టికెట్ నెంబర్లను ఆయన పరిశీలించారు. తన వెంట సిఆర్పి రాజయ్య ఉన్నారు.