ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట మెప్మా ఆర్పీల నిరసన..

Mepma RPs protest in front of Adilabad Collectorate..నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
మెప్మా ఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గిమల్ల స్వామి అన్నారు. బుధవారం ఆర్పీలతో కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్పీల సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గిమల్ల స్వామి మాట్లాడుతూ… ఆర్పీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంతో పాటు ఏడు నెలలుగా పెండింగ్ వేతనాలను విడుదల చేయాలన్నారు. పది లక్షల ప్రమాద భీమను అమలు చేయాలని, ఆర్పీలు చనిపోతే మట్టి ఖర్చులకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణ ఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల చిన్నన్న, ఆర్పీల సంఘం అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శి ధనలక్ష్మీ, ఉపాధ్యక్షురాలు ఫరిద, కోశాధికారి రేవతి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.