మేరా మట్టి మేరా దేశ్  అనే కార్యక్రమం 9నుండి 30వరకు..

నవతెలంగాణ -డిచ్ పల్లి
కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీ లో ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో మేరా మట్టి మేరా దేశ్  అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సమన్వయ కర్త డా” రవీందర్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 9 నుండి 30 వరకు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75 మొక్కలను నాటమన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. యాదగిరి, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాలకు ఎన్ఎస్ఎస్ వాలెంటర్లు,అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది హాజరుకా నున్నారు. ఈ కార్యక్రమానికి  దత్తత గ్రామాల్లో పదవి విరమణ పొందిన ఆర్మీ సిబ్బందిని, స్వతంత్ర సమరయోధులను, పోలీస్ అధికారులను సన్మానించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.