న్యూఢిల్లీ : శ్రమజీవుల కష్టార్జీతంతో కోట్లకు పడగలెత్తిన శతకోటీశ్వర్లపై పన్నులు (బిలియనీర్ ట్యాక్స్) విధించాలంటూ ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో నూతన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టేవారికి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఇదే అంశంపై ప్రశ్నలు సంధించారు. ‘బిలియనీర్ పన్నుపై మీరెంటుంటారు?’ అని ఆయన నిలదీశారు. శతకోటీశ్వర్లపై పన్ను విధించడానికి మద్దతు ఇస్తారా? లేదా ఎప్పటిలాగే పేదలపై భారాలు మోపడం కొనసాగిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.