– మంత్రి రాజనర్సింహకు తెలంగాణ సాక్స్ యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమకు న్యాయం చేయాలని తెలంగాణ సాక్స్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆ యూనియన్ నాయకులు ఎం రంజిత్‌కుమార్, టి శివప్రసాద్, శ్రీదేవి శనివారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. సాక్స్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసుకున్నా, రెగ్యులర్ చేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 20 ఏండ్లుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో వారిని విలీనం చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. సాక్స్ డైరెక్టర్‌కు మంత్రి ఫోన్ చేసి విలీనం అంశంపై వివరాలను పంపించాలంటూ ఆదేశించారని పేర్కొన్నారు.