జాతీయ స్థాయి పోటీలో మెరిసి గిరిజన తండ కోకిల 

నవతెలంగాణ-వీర్నపల్లి : ఉత్తరాఖాండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ లో నాలుగు రోజులు జరిగిన ఇ ఎం అర్ ఎస్ స్కూల్స్ టీచర్స్ మీట్ పాటల పోటీలో భట్టు సుజాత తెలంగాణా రాష్ట్రం నుంచి పాల్గోని 29 రాష్ట్రాల నుంచి టీచర్స్ పోటీలో పాల్గొన్నగా భట్టు సుజాత జానపద పాటలు పాడి మొదటి బహుమతి గెలుచుకుంది. కథనంలోకి వెళితే వీర్నపల్లి మండలం బావుసింగ్ నాయక్ తండ గ్రామం గోల్య నాయక్ తాండలో భట్టు మంగవ్వ, హరిచంద్ ల రెండవ సంతానం. తల్లిదండ్రులు కూరగాయలు అమ్ముతూ, కంకులు కాల్చుతూ జీవనం కొనసాగిస్తున్నారు. పిల్లల చదువు కోసం ఊరురా తిరిగి ఉప్పు అమ్మి చదివించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సహంతో తిరుపతిలో బి ఎ మ్యూజిక్, ఎం ఎ మ్యూజిక్ చేశారు.2020 లోమ్యుజిక్ టీచర్ గ ఉద్యోగం సాదించారు. మహబూబ్ నగర్ సిరోల్ గురుకులలో విధులు నిర్వహిస్తున్నారు.ఉపాధ్యాయుల మీట్ లో జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సంపాదించడంతో గురుకుల సెక్రటరీ స్కూల్ ప్రిన్సిపాల్ చైతన్య, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయుల బృందం, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
మారుమూల తండ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తన మార్గంలో విద్యార్థులను తీర్చాదిద్దుతున్నందుకు అధికారులు హార్షం వ్యక్తం చేశారు. చదువుకోవాలనే తపన ఉన్నా ఏంతో మంది ఆడపిల్లలకు ఆదర్శంగా నిలిచారు.