నిధుల సమీకరణలో మెర్య్కూరీ ఇవి టెక్‌

Merykoori these are tech in fundraisingహైదరాబాద్‌ : విద్యుత్‌ వాహన రంగంలో మెర్య్కూరీ ఇవి టెక్‌ లిమిటెడ్‌ రూ.480 కోట్ల నిధులు సమీకరించనున్నట్లు వెల్లడించింది. కన్వర్టిబుల్‌ ఈక్విటీ వారెంట్లు లేదా ప్రిఫరెన్షియల్‌ బేసిస్‌లో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని ఆ కంపెనీ ప్రకటించింది. దీనికి వాటాదారులు, ఇతర చట్టబద్ధమైన నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉంది. ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా 118.06 కోట్లు, కన్వర్టిబుల్‌ వారెంట్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.362.25 కోట్లు చొప్పున సమీకరించనున్నట్లు తెలిపింది.