హైటెక్‌ ఆటోమోటివ్‌లో మెర్య్కూరీకి 70 శాతం వాటా

హైదరాబాద్‌ : హైటెక్‌ ఆటోమోటివ్‌లో 70 శాతం వాటా కొనుగోలుకు తమ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ మెర్య్కూరీ ఈవీ టెక్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. దీంతో హైటెక్‌ ఆటోమోటివ్‌ తమ అనుబంధ సంస్థగా ఉండనుందని పేర్కొంది. ఇదే క్రమంలో మూడు చక్రాల ఈవీ మార్కెట్‌లో తమ స్థానం బలోపేతంపై దృష్టి కేంద్రీకరించినట్లయ్యిందని తెలిపింది. మెజారిటీ వాటా కొనుగోలు ద్వారా తమ ప్రస్తుత కార్యకలాపాలు, పంపిణీ నెట్‌వర్క్‌లు, కస్టమర్‌ బేస్‌ పేరగనుందని పేర్కొంది.