కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కష్ణ హీరోయిన్‌గా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఓ ప్రత్యేక వేడుకలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, ‘మా అబ్బాయి ఉపేంద్ర హీరోగా ఐదవ సినిమాగా మొదలు పెట్టిన ఈ సినిమాలోని చివరి పాటను ఊటీలో చిత్రీకరించడంతో షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ నెల 29న మా అబ్బాయి పుట్టినరోజున ప్రీ రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించబోతున్నాం. అదేరోజున ట్రైలర్‌నూ విడుదల చేస్తాం. నవంబర్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’అని చెప్పారు.
’75 శాతం వినోదంతోపాటు మాస్ అంశాలు అందర్నీ అలరిస్తాయి. సోషల్ మీడియా నేపథ్యంలో సందేశాత్మక పాయింట్‌ను కూడా ఇందులో ఆవిష్కరించాం’ అని దర్శకుడు అన్నారు.
హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ, ‘ఈ రోజు మా అమ్మ, నాన్న పెళ్లిరోజు. వారికి కానుకగా ఈ టీజర్‌ని రిలీజ్ చేశాం. టీజర్ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పారు.
వినోదం + సందేశం
10:31 pm