సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘సర్కారు నౌకరి’. భావన హీరోయిన్. ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా న్యూఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాను శనివారం పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ, ‘కంటెంట్ ఓరియెంటెడ్‌గా సాగే సినిమా. యదార్థ ఘటనల స్ఫూర్తితో 90వ దశకం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించాను. సందేశం, వినోదం రెండు కలిసి సినిమా ఇది. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. ‘ఈ మూవీ మా కెరీర్‌కు ఫస్ట్ స్టెప్. కొత్త ఏడాదిలో మొదటి రోజున మీ ముందుకు వస్తోంది. ఈ మొదటి అడుగులోనే ప్రేక్షకులు విజయాన్ని అందించి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇందులో ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను. సొసైటీకి మంచి చేయాలనే తాపత్రయం ఒకవైపు, కుటుంబం, స్నేహితుల నుంచి ఎదుర్కొనే సంఘర్షణ మరోవైపు నా క్యారెక్టర్‌కు అన్ని ఎమోషన్స్ తీసుకొస్తాయి’ అని హీరో ఆకాష్ చెప్పారు. హీరోయిన్ భావన మాట్లాడుతూ,’మనసును తాకే ఎమోషన్, ఎంటర్‌టైన్ మెంట్ కథలో ఉన్నాయి’ అని తెలిపారు.
వినోదం + సందేశం
12:28 am