కత్తెర పురుగు నివారణకు రసాయనిక మందులు పిచికారి చేయకుండా జీవ శిలీంద్రం మెటారైజియం అనేసిఫోలియ వినియోగించుకోవాలి వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున అన్నారు.శనివారం మండలంలోని పెద్ద మాసాన్ పల్లి రైతు మెట్టు మల్లయ్య మొక్కజొన్న సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రంలో మెటారైజియం అనేసిఫోలియ పై అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మొక్కజొన్న పంటలు ప్రధానంగా ఆశించే కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగు పంట వేసిన 15 రోజుల నుండి పంట కోసే కంకి దశ వర కు ఆశిస్తుందన్నారు. ఆర్థిక నష్ట పరిమితి దాటి నప్పుడు రసాయనిక మందులు పిచికారి చేయకు డ దన్నారు. మెటారైజియం అనేసిఫోలియ ఇది జీవ శిలీంద్రం ఇది సిద్ధ బీజాలు రూపంలో ఉంటా యని తెలిపారు. వీటిని పిచికారి చేసినప్పుడు పురుగు శరీరం పై పడి కణజాలల్లో చొచ్చుకుపోయి అక్కడ శిలీంద్రంగా వృద్ధి చెందుతుంది, పురుగులో ని శక్తి అంతా లాక్కోవడంతో పురుగు నీరసించి చనిపోతుంది. కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు నివారణకు మెటారైజియం అనేసిఫోలియ శిలీంద్రం ద్రావణం 5 ఎం.ఎల్ లీటరు నీటికి కలిపి ఎకరానికి 200 లీటర్ల ద్రావణాన్ని మొక్కలు పూర్తి గా తడిసే విధంగా పిచికారి చేసుకోవాలి. ఈ జీవ శిలీంద్రం ద్వారా పర్యావరణానికి, మనుషులకు ఎటువంటి హాని కలగదను అన్నారు. అంతేకాకుం డా మెటారైజియం పోషకాలను, నీళ్లను మొక్క సమపాలల్లో తీసుకునే విధంగా చేసి దిగుబడుల ను పెంచుతుందని వివరించారు. మెటారైజియం భాస్వరాన్ని మొక్కకు అందే విధంగా చేస్తుంది. జీవ శిలీంద్రం వినియోగించేటప్పుడు రైతులు జాగ్ర త్తలు పాటించాలని సూచించారు. పిచికారి చేసిన ఐదు రోజుల వరకు ఎటువంటి శిలీంద్ర నాసిని మందు వాడరాదని తెలిపారు.