మెట్రో పొడిగింపు కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం

నవతెలంగాణ – పటాన్‌ చెరు
మియాపూర్‌ నుండి పటాన్‌ చెరు వరకు మెట్రో పొడిగింపు కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు, ఐఎన్‌ టి యు సి జిల్లా అధ్యక్షులు కొల్కూరి నర్సింహరెడ్డి అన్నారు. బుధవారం పటాన్‌చెరు లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం 30 రోజుల పాలనపై సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ 30 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రం అభివద్ది పదం తో దూసుకుపోతున్న డైనమిక్‌ యంగ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ కొండా సురేఖ, మాజీ మంత్రులు గీతారెడ్డి, ఏ చంద్రశేఖర్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి డిసిసి అధ్యక్షురాలు నిర్మల జయప్రకాశ్‌ రెడ్డి, ఇంచార్జీ కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తో పాటు ఆరు గ్యారెంటీ పథకా లు అమలు కోసం కమిటీ, నూతన పరిశ్రమలు గోద్రెజ్‌ కోకోకోలా, బిల్ట్‌, ఆదని గ్రూపు, హేరో స్పేస్‌ ఇలా అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిదే అన్నారు 9 యేండ్ల టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పేదలు నిరుపే దలుగా మారారని దానికి నిదర్శనమే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కోటి 25 లక్షల మంది ఆరు గ్యారంటీల పథకంపై దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కార్యదర్శి చిన్నా ముదిరాజ్‌, కార్య దర్శి సామయ్య, మాజీ సర్పంచ్‌ సంజీవరెడ్డి, న్యాయవాది ఐఎన్టియుసి అడ్వైజర్‌ రామారావు, నాయక ులు పాషా హమీద్‌, కుంచల కిషన్‌, రాజు, కమల్‌, శ్రీనివాస్‌, ప్రబు, తదితరులు పాల్గొన్నారు.