వ్యవసాయ డ్రోన్లలోకి మెజ్లానిక్‌ క్లౌడ్‌

హైదరాబాద్‌ : నగర కేంద్రంగా పని చేస్తోన్న మెజ్లానిక్‌ క్లౌడ్‌ కొత్తగా వ్యవసాయం, సరకు రవాణా సేవలకు ఉపయోగపడే డ్రోన్లను ఆవిష్కరించి నట్లు ప్రకటించింది. వ్యవసాయంలో క్రిమిసంహారకాలను పిచికారీ చేసేందుకు వీలుగా డ్రోన్లనూ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. సరకులను చేరవేసే డ్రోన్లు 2-100 కిలోల బరువును మోస్తాయని ఆ సంస్థ సిఇఒ సుధీర్‌ రెడ్డి తుమ్మ వెల్లడించారు. ఇవి 5-60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయన్నారు.. తమ డ్రోన్ల ధరలు రూ.4-50 లక్షల శ్రేణిలో ఉంటాయన్నారు. 2022-23లో 37.23 శాతం వృద్థితో రూ.387.50 కోట్ల రెవెన్యూ సాధించినట్లు తెలిపారు. ఇదే సమయంలో లాభాలు 151.61 శాతం పెరిగి రూ.74.10 కోట్లుగా నమోదయ్యాయన్నారు.