ఈవీ ఛార్జింగ్ నెట్ వర్క్ ను భాగస్వామం ఎంజీ ఇండియా, హెచ్ పీసీఎల్

నవతెలంగాణ-హైదరాబాద్ : స్థిరమైన సంచారం దిశగా తీసుకున్న చర్యలో భాగంగా, భారతదేశపు ఈవీ ఛార్జింగ్ మౌలికసదుపాయాన్ని మెరుగుపరిచి మరియు సుసంపన్నం చేయడానికి తమ వ్యూహాత్మకమైన భాగస్వామాన్ని ఎంజీ మోటార్ ఇండియా మరియు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. (హెచ్ పీసీఎల్) లు ప్రకటించాయి. ఈ చర్యలో భాగంగా, ఎంజీ మరియు హెచ్ పీసీఎల్ లు కలిసి 50kW/60kW DC ఫాస్ట్ ఛార్జర్స్ ను కీలకమైన ప్రదేశాల్లో అనగా భారతదేశంలో నగరాలు, జాతీయ రహదారులపై ఏర్పాటు చేస్తాయి. తమ దూర ప్రయాణాలు మరియు ఇంటర్ సిటీ ప్రయాణం చేసే సమయంలో ఈవీ ఛార్జర్స్ లభ్యతను పెంచడం ద్వారా ఈవీ యూజర్స్ కు సౌకర్యాన్ని కేటాయించడంపై ఈ సహకారం దృష్టి కేంద్రీకరించింది. CCS 2 ఛార్జింగ్ స్టాండర్డ్ తో అనుకూలంగా అన్ని ఈవీల కోసం ఛార్జర్స్ పబ్లిక్-మోడ్ నెట్ వర్క్ రూపొందించబడింది. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ మైఎంజీ యాప్ పై ఎంజీ కస్టమర్స్ కు లభిస్తాయి మరియు సమీకృత హెచ్ పీసీఎల్ నెట్ వర్క్ డిస్కవరీ సాధనం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. గౌరవ్ గుప్తా, ఛీఫ్ గ్రోత్ ఆఫీసర్, ఎంజీ మోటార్ ఇండియా, ఇలా అన్నారు, ”ఎలక్ట్రిక్ సంచారానికి విజయవంతంగా పరివర్తన చెందడానికి కీలకం దృఢమైన ఈవీ పర్యావరణ వ్యవస్థ ఉండాలి. ఈవీ రంగంలో ముందస్తు చర్యగా ఎంజీ శక్తివంతమైన ఈవీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ముందుంది. బ్యాటరీ రీసైక్లింగ్ & ఎలక్ట్రిక్ వాహనాల యొక్క పూర్తి సుస్థిరత కోసం బ్యాటరీ రెండవ జీవిత కాల పరిష్కారాలకు అదనంగా మా పర్యావరణ వ్యవస్థ భాగస్వాములతో పాటు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ యొక్క విస్తృతమైన నెట్ వర్క్ ను తయారు చేయడానికి మేము పని చేస్తున్నాం. కస్టమర్ ఆత్మవిశ్వాసాన్ని ఈవీలలో మెరుగుపరచడానికి మరియు శక్తివంతం చేయడానికి భారతదేశంలో ఈవీ ఛార్జింగ్ మౌలికసదుపాయాన్ని విస్తరించడానికి హెచ్ పీసీఎల్ తో మా భాగస్వామం మరొక చర్య. దేశంలో ఇప్పటికే ఉన్న మరియు కాబోయే ఈవీ యూజర్స్ మా ఛార్జింగ్ పరిష్కారాలను సౌకర్యవంతంగా పొందగలరని భారతదేశంలో హెచ్ పీసీఎల్ విస్తృతమైన నెట్ వర్క్ మరియు గణనీయమైన ఉనికి నిర్థారిస్తుంది.“ రాజ్ దీప్ ఘోష్, ఛీఫ్ జనరల్ మేనేజర్, హైవే రీటైలింగ్, హెచ్ పీసీఎల్ ఇలా అన్నారు, “హెచ్ పీసీఎల్ కు దేశవ్యాప్తంగా 22000+ ఫ్యూయల్ స్టేషన్స్ నెట్ వర్క్ ఉంది మరియు కస్టమర్స్ కు పర్యావరణానుకూలమైన ఇంధనం కేటాయించడం ద్వారా సుస్థిరమైన భవిష్యత్తుకు కట్టుబడింది. ఇంకా, డిసెంబర్ 2024 నాటికి 5000 ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసే లక్ష్యం కలిగి ఉంది. ఎంజీ మోటార్ ఇండియాతో ఈ భాగస్వామం ద్వారా, హెచ్ పీసీఎల్ భారతదేశంవ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన తమ ఛార్జర్స్ వినియోగాన్ని పెంచడానికి ఎంజీ యొక్క వాహనాలను సమన్వయం చేస్తుంది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు వివిధ ప్రాంతాలలో ఈవీ ఛార్జింగ్ లో వ్యూహాత్మకమైన విస్తరణను విస్తరించడానికి హెచ్ పీసీఎల్ ఛార్జర్ వాడకాన్ని విశ్లేషిస్తుంది . ఈ సమన్వయం రాబోయే రోజుల్లో ఈవీల వృద్ధిలో సహాయపడుతుంది.” ఛార్జింగ్ స్టేషన్స్ ను వినియోగించే కస్టమర్స్ లాయల్టీ రివార్డ్స్, ప్రత్యేకమైన ప్రోత్సాహాలతో కూడా ప్రయోజనం పొందుతారు మరియు ఎలక్ట్రిక్ సంచారం వాడకాన్ని మరింత ప్రోత్సహిస్తారు. ఈ సహకారం ఆధునిక సుస్థిర సంచార పరిష్కారాలను మరియు రవాణా రంగంలో సానుకూలమైన మార్పును ప్రోత్సహించడానికి ఎంజీ మోటార్ ఇండియా మరియు హెచ్ పీసీఎల్ వారి ఏకీకృత కలను శక్తివంతం చేస్తుంది. ఎంజీ ఇండియా వారి ఈవీ ప్రయత్నాలు: ఈవీ రంగంలో మార్గదర్శకునిగా, మేము మా రెండవ కారు భారతదేశపు పూర్తి – ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ SUV – MG ZS EVని విడుదల చేయడానికి ముందు విస్తృతమైన అందుబాటుతో దృఢమైన ఇకో సిస్టంను అభివృద్ధి చేయడానికి మేము దృష్టి కేంద్రీకరించాం. మా స్మార్ట్ మరియు సుస్థిరమైన ఉత్పత్తులతో పాటు, దృఢమైన ఛార్జింగ్ ఇకో వ్యవస్థను సృష్టించడానికి 6–వే ఛార్జింగ్ మౌలికసదుపాయంతో దృఢమైన ఈవీ పర్యావరణాన్ని మేము సృష్టించాం మరియు టాటా పవర్, డెల్టా ఎలక్ట్రానిక్స్, మరియు ఫోర్టమ్ వంటి మా ఇకో సిస్టం భాగస్వాములతో కలిసి పబ్లిక్ మరియు ఇంటి ఛార్జర్స్ సహా దేశవ్యాప్తంగా 15,000కి పైగా ఛార్జింగ్ టచ్ పాయింట్స్ ను మేము ఏర్పాటు చేసాం. ఇంకా, భారతదేశంవ్యాప్తంగా వివిధ టచ్ పాయింట్స్ లో ఛార్జింగ్ స్టేషన్స్ స్థాపించడానికి కంపెనీ బీపీసీఎల్ మరియు జియో-బీపీతో భాగస్వామం చెందింది. ఈవీ బ్యాటరీస్ రెండవ జీవిత కాలం మరియు రీసైక్లింగ్ కోసం ఎంజీ కూడా ఎక్సికామ్, టాటా పవర్, ATTERO, UMICORE, TES AMM SUPER మరియు LOHUM తో భాగస్వామం చెందింది. ఛార్జింగ్ నెట్ వర్క్ ను మద్దతు చేయడానికి మరియు కస్టమర్ కు అందుబాటులో ఉంచడానికి రాబోయే ఎంజీ డీలర్ షిప్స్ వద్ద CC2 60 kW DC ఏర్పాటు చేయడానికి ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల అదానీ టోటల్ ఎనర్జీస్ ఈ-మొబిలిటీతో గణనీయమైన భాగస్వామాల కోసం సంతకం చేసింది. బ్యాటరీ రీసైక్లింగ్ మరియు రెండవ జీవిత కాలం నైపుణ్యత కోసం, ఛార్జింగ్ పరిష్కారాలు మరియు LICO కోసం పవర్ ఈవీ సహా ఎప్సిలాన్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థలతో అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది. ఈ భాగస్వామాలు దేశంలో విస్తృతమైన మరియు సమర్థవంతమైన ఛార్జింగ్ మౌలికసదుపాయం అభివృద్ధి చెందే నిబద్ధతను సూచిస్తున్నాయి.